2019 ఏడాదిలో క్రికెట్ పరంగా అభిమానులకు ఎన్నో జ్ఞాపకాలు మిగిలిపోయాయి. వివాదాలు, సంచలనాలు, తీపి జ్ఞాపకాలు, చరిత్ర చూడని ప్రదర్శనలు… ఇలా ప్రతీ ఒక్కటి 2019 లో నమోదు అయ్యాయి…
ఫిబ్రవరిలో… సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక మిడిల్ ఆర్డర్ ఆటగాడు… కుశాల్ పెరారా ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులు ఇప్పట్లో మర్చిపోలేరు. జట్టు ఓటమి లాంచనం అనుకున్న తరుణంలో అతను ఆడిన ఇన్నింగ్స్… బలమైన జట్టుగా సౌత్ ఆఫ్రికాకు చుక్కలు చూపించింది. ఆఖరి వికెట్ కు 70 పరుగుల భాగాస్వామ్య౦ నమోదు చేసిన పెరారా మ్యాచ్ ని ఒంటి చేత్తో గెలిపించాడు. రాబాడా, స్టెయిన్ లాంటి నాణ్యమైన బౌలింగ్ ని దీటుగా ఎదుర్కొన్నాడు.
ఇక ప్రపంచకప్ లో ఆద్యంతం ఏదోక సంచలనం నమోదు అవుతూనే వచ్చింది. బలమైన జట్టుగా ఉన్న సఫారి జట్టు లీగ్ దశలోనే టోర్నీ నుంచి వైదొలగడం… తన కంటే బలహీనంగా ఉన్న న్యూజిలాండ్ జట్టుపై టీం ఇండియా సెమి ఫైనల్ లో ఓడిపోవడం, ఆ మ్యాచ్ లో కీలక సమయంలో ధోని లాంటి ఆటగాడు రనౌట్ అవ్వడం, ఆ టోర్నీలో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ చేసిన సెంచరీలు అన్నీ కూడా సంచలనాలే…
అదే ప్రపంచకప్ ఫైనల్ లో ఇంగ్లాండ్ విజయం ప్రపంచకప్ చరిత్రలోనే ఎవరూ మరువలేనిది… మార్టిన్ గుప్తిల్ విసిరినా త్రో… బెన్ స్తోక్స్ బ్యాట్ కి తగిలి నాలుగు పరుగులు వెళ్ళడం, మ్యాచ్ డ్రా గా ముగియడం, సూపర్ ఓవర్ కూడా టై అవ్వడం, ఫోర్లు సిక్సుల ఆధారంగా ఇంగ్లాండ్ ని విజేతగా నిలపడం ఎవరూ మరువలేనిది.
ఐపియల్ లో గెలుస్తుంది అనుకున్న చెన్నై కి షేన్ వాట్సన్ కి అయిన గాయంతో ఊహించని మలుపు తిరిగి… ముంబై విజయం సాధించడం అభిమానులను షాక్ కి గురి చేసింది.