Actress Ashi Roy: అది రేవ్ పార్టీ కాదు..బర్త్ డే పార్టీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటి ఆషీ రాయ్. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. ఈ తరుణంలోనే.. బెంగళూరు రేవ్ పార్టీపై కేసు నమోదు చేసారు పోలీసులు. కానీ ఈ రేవ్ పార్టీలో దొరికిన వీఐపీల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు అధికారులు.
100- 150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని.. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు బెంగళూరు పోలీసులు.. రేవ్ పార్టీలో తెలుగు, తమిళ, కన్నడ, సినీనటులు, రాజకీయ, వ్యాపారవేత్తలు ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే… అది రేవ్ పార్టీ కాదు..బర్త్ డే పార్టీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటి ఆషీ రాయ్. వాసు అన్నయ్య పార్టీ అని పిలిస్తే వెళ్ళాను అంటూ వ్యాఖ్యానించారు ఆషి రాయ్. కాగా బెంగళూరు రేవ్ పార్టీని వాసు నిర్వహించిన సంగతి తెలిసిందే.