ఇంటిపేరు మ్యాటర్ కానేకాదు: జొమాటో సీఈఓ వీడియోపై మోదీ పోస్టుL

-

‘‘నేటి భారతంలో ఇంటి పేరుతో పట్టింపు లేదు. శ్రమించడమే ఇక్కడ ముఖ్యం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మీ ప్రయాణం ఒక ప్రేరణ, స్ఫూర్తిదాయకం. స్టార్టప్‌ల అభివృద్ధి కోసం అనుకూల వాతావరణాన్ని అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం’’ అని మోదీ అన్నారు. జొమాటో సీఈఓ వీడియోను రీపోస్టు చేస్తూ మోదీ పోస్టు షేర్ చేశారు.

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ నిర్వహించిన ‘విశేష్ సంపర్క్’ కార్యక్రమంలో జొమాటో ప్రారంభ రోజుల నాటి అనుభవాలను ఆ సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్‌ వివరించారు. ప్రభుత్వ సహకారంతో చిన్న పట్టణానికి చెందిన కుర్రాడు కూడా జొమాటో వంటి సంస్థను స్థాపించడం సాధ్యమవుతుందని తాను నిరూపించినట్లు చెప్పారు. స్టార్టప్‌ ప్రారంభించాలన్న ఆలోచన వచ్చిన వెంటనే తన తండ్రితో చర్చించానని చెప్పారు. అప్పుడు ఆయన..‘‘నీ తండ్రి స్థాయి ఏంటో తెలుసా..? ఇంత చిన్న ఊరిలో మనం ఏమీ చేయలేం. అది అసాధ్యం’’ అని సందేహం వ్యక్తం చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ సహకారంతో తన కల సాకారమైందని, 2008లో సంస్థను స్థాపించినప్పటి నుంచి నేటి వరకు లక్షలాది మందికి ఉపాధి కల్పించినట్లు దీపిందర్ తెలిపారు.

https://x.com/narendramodi/status/1793114825209549171

Read more RELATED
Recommended to you

Latest news