సామూహిక సమ్మె …70 శాతం విమాన సర్వీసులు క్యాన్సిల్

-

సామూహిక సమ్మె కారణంగా పారిస్ విమానాశ్రయంలో ఫ్రెంచ్ ఎయిర్‌లైన్స్ 70 శాతం విమాన సర్వీసులను రద్దు చేసింది. రెండు నెలల్లో.. అనగా జూలై 26న పారిస్ లో ఒలింపిక్స్‌ గేమ్స్ ప్రారంభం కానుంది.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సమ్మె కారణంగా పారిస్ ఓర్లీ విమానాశ్రయంలో శని, ఆదివారాల్లో 70 శాతం విమానాలను రద్దు చేయాలని ఫ్రెంచ్ పౌర విమానయాన అథారిటీ విమానయాన సంస్థలను ఆదేశించింది.2 రోజుల రద్దు కారణంగా వాణిజ్య విమానాలపై ప్రభావం చూపుతాయని DGAC అథారిటీ వెల్లడించారు.

నెల రోజుల వ్యవధిలో విమాన సిబ్బంది ఇలా హఠాత్తుగా సమ్మెకు దిగడం ఇది 2 వ సారి. మే ప్రారంభంలో సమ్మె కారణంగా ఐరోపా దేశాలకు పెద్దసంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమానాశ్రయ అధికారులు, అక్కడి ప్రధాన లేబర్‌ యూనియన్‌ ఎస్‌ఎన్‌సీటీఏ మధ్య చర్చలు సఫలమవడంతో అప్పటి వివాదం ముగిసింది. తాజాగా రెండో అతిపెద్ద లేబర్‌ గ్రూప్‌ యూఎన్‌ఎస్‌ఏ- ఐసీఎన్‌ఏ సమ్మెకు పిలుపునిచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news