దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ 6వ దశ పోలింగ్ జరిగింది. మొత్తం 58 లోక్ సభ స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరిగాయి. అలాగే జమ్మూకాశ్మీర్ లో కూడా ఎన్నికలు జరగడం గమనార్హం.
అయితే కశ్మీర్ లోయలో పోలింగ్కు ఓటర్లు పోటెత్తారు. గత 35 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అనంత్నాగ్-రాజౌరీ పార్లమెంటు నియోజకవర్గంలో 51.35% ఓటింగ్(సా.5గంటల వరకు) నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో కశ్మీర్లోని మూడు స్థానాల్లో అత్యధిక ఓటింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. కాగా శ్రీనగర్ లో 38.49శాతం, బారాముల్లాలో 59.1% పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. 2019లో ఈ మూడు చోట్ల సగటున 19.16శాతం పోలింగ్ నమోదైంది.
ఇదిలా ఉంటే… చివరి దశ ఎన్నికలు జూన్ 01 ఎన్నికలు జరుగుతాయి. మిగిలిన స్థానాలకు ఆరోజే పోలింగ్ ఉంటుంది. దేశవ్యాప్తంగా 543 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి జూన్ 04న ఫలితాలు వెలువడనున్నాయి.