తెలంగాణలోకి కొత్త బ్రాండ్ మద్యం ఎంట్రీపై జూపల్లి కీలక ప్రకటన

-

తెలంగాణలోకి కొత్త బ్రాండ్ మద్యం ఎంట్రీపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కీలక ప్రకటన చేశారు. నిబంధ‌ల‌న మేర‌కే సోమ్ డిస్టిల‌రీస్ బ్రాండ్ మ‌ద్యం స‌ర‌ఫ‌రాకు అనుమ‌తి ఇచ్చినట్లు పేర్కొన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి. నియ‌మ నిబంధ‌న‌ల మేర‌కే సోమ్ డిస్టిలరీస్ కంప‌నీ త‌మ ఉత్ప‌త్తుల‌ను తెలంగాణ బేవ‌రేజ్ కార్పోరేష‌న్ కు స‌ర‌ఫరా చేసేందుకు అనుమ‌తినిచ్చిందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

Jupalli key announcement on new brand liquor entry into Telangana

కొత్త మ‌ద్యం బ్రాండ్లకు సంబంధించి త‌మ వ‌ద్ద‌కు ఎటువంటి ద‌ర‌ఖాస్తులు రాలేవ‌ని గ‌తంలో ఓ ప్రెస్ మీట్ సంద‌ర్భంగా తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఆ ఫైల్ త‌న వ‌ద్ద‌కు రాలేద‌ని, ఇప్పుడు ఉన్న ప్రోసీజ‌ర్ ప్ర‌కార‌మే నిర్ణ‌యాలు తీసుకునే అధికారం బెవ‌రేజ్ కార్పోరేష‌న్ కు ఉంద‌ని, ఈ నేప‌థ్యంలోనే సోమ్ డిస్టిల‌రీస్ కు త‌మ ఉత్ప‌త్తుల స‌ర‌ఫ‌రాకు అమ‌మ‌తినిచ్చార‌ని మంత్రి వెల్ల‌డించారు. బేవ‌రేజ్ కార్పోరేష‌న్ రోజువారీ కార్య‌క‌లాపాలు త‌మ దృష్టికి రావ‌ని వాస్త‌వ‌వాల‌ను తెలుసుకోకుండానే కొన్ని ప‌త్రిక‌లు అస‌త్య వార్త‌ల‌ను ప్రచురించాయ‌ని మంత్రి అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో హోల్‌సేల్ మ‌ద్యం స‌ర‌ఫ‌రాకు కొత్త బ్రాండ్లకు అనుమ‌తులు ఇచ్చే ప్ర‌క్రియ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ప‌రిధిలో ఉంటుంద‌ని, డిమాండ్- స‌ప్ల‌య్ ను బ‌ట్టి కొత్త కంప‌నీల‌కు అనుమ‌తులు మంజూరు చేస్తుంద‌ని ఓ ప్ర‌కట‌న‌లో పేర్కొన్నారు. రెండు ద‌శాబ్దాలుగా సోమ్ డిస్టిలరీస్ త‌మ ఉత్ప‌త్తుల‌ను విక్ర‌యిస్తుంద‌ని, దేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని IMFL సరఫరాదారుగా ఉందని చెప్పారు. ఇప్ప‌టికే ఉన్న‌ ఎక్సైజ్ పాల‌సీ ప్ర‌కార‌మే బెవ‌రేజ్ కార్పోరేష‌న్ లిమిటెడ్ ఎండీ….. సామ్ డిస్టిలరీస్ తో పాటు ఇత‌ర కంపనీల‌కు మ‌ద్యం స‌ర‌ఫ‌రాకు అనుమ‌తులిచ్చార‌ని తెలిపారు. ఎక్క‌డా కూడా నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న జ‌ర‌గ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news