భర్త వేరే మహిళతో ఉండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..!

-

సాధారణంగా భార్య, భర్తలు ఇద్దరూ కలిసి మెలిసి నిండు నూరేళ్లు జీవించాలని పెళ్లి చేసుకుంటారు. ఒకరికీ ఒకరూ తోడు, నీడగా జీవిస్తారని పెద్దల సమక్షంలో వివాహం జరిపిస్తారు. అన్ని కార్యాల కంటే కూడా పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ చాలా వరకు పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే భార్య, భర్తలు విడిపోవడం.. కలిసి మెలిసి ఉండకపోవడం.. ఆత్మహత్యలు, వరకట్న వేధింపులు ఇలా ఏదో ఒక సంఘటన జరిగి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

ఇలాంటి ఘటన ఒకటి తాజాగా వైజాగ్ లో చోటు చేసుకుంది. భార్య ఇంట్లో లేని సమయంలో భర్త మరో మహిళతో రాసలీలలు ఆడతుండగా అకస్మాత్తుగా భార్య వచ్చేసింది. దీంతో ఆ భార్యకు ఏమి చేయాలో తెలియక బయటివైపు నుంచి తలుపు పెట్టి మీడియాతో వెళ్లింది. తన భర్త గుట్టును రట్టు చేసింది. మూడు ముళ్లు వేసిన భార్యను కాదని తన భర్త పరాయి స్త్రీతో ఎలా సంసారం చేస్తాడని తిట్టి.. మరో మహిళలను కొట్టింది. వారిద్దరినీ ఆగ్రహంతో తిట్లు తిట్టింది. తనకు న్యాయం చేయాలని తన గోడును మీడియా ముందు వెల్లబోసుకుంది. పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టింది. తనకు పెళ్లి జరిగి.. ఆరేళ్ల పాప కూడా ఉందని మొరపెట్టుకుంది. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news