కేసీఆర్ పై టీ కాంగ్రెస్ సంచలన ట్వీట్..!

-

భావోద్వేగాలు రెచ్చగొట్టి భవితము అడ్డుకోవడం దొరవారికి వెన్నతో పెట్టిన విద్య అంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్పై టీ కాంగ్రెస్ ఫైర్ అయింది. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ.. ఎక్కడికక్కడ విద్వేషాలు రెచ్చగొడుతూ.. విద్రోహనికి తెర లేపుతూ.. విధ్వంసానికి పన్నాగం పన్నే మీరా తెలంగాణ జాతి పిత అంటూ ప్రశ్నించింది. ప్రాంతాలుగా విడిపోదాం.. ప్రజలుగా కలిసుందాం అన్న నోరే కదా అది.. ఇప్పుడు ఈ విద్వేషాలకు తెరలేపడం వెనక మీ ఉద్దేశ్యం ఏమిటి ప్రేతా అని సీరియస్ అయింది. దేశ్ కా నేత అని డప్పు కొట్టుకునే నువ్వు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం వెనక మతలబు ఏమిటి అని క్వశ్చన్ చేసింది.

నువ్వు అధికారంలో ఉంటే అందరూ నా వాళ్ళే .. కడుపుల పెట్టి దాసుకుంటా అంటావ్.. అధికారం కోల్పోతే వాడెవడు.. వీడెవడు అంటావా? నీ రాజకీయ మనుగడ కోసం ఇంకెన్నాళ్ళు చిచ్చులు పెడతావ్ ప్రేతా?! ఉద్యమానికి ఉనికి ఇచ్చిన వారందరికి ఉత్త చేతులు చూపి.. ఇప్పుడు మల్లా అదే విద్వేష రాజకీయాలకు తెర లేపుతామంటే.. చూస్తూ కూర్చోదు తెలంగాణ సమాజం..!! తెలంగాణ సమాజం నీ అవకాశవాద రాజకీయాలని గమనిస్తూనే ఉంది. నీ రాజకీయ ఉనికి కోసం విద్వేషాలు రెచ్చగొడతా అంటే తోక కత్తిరిస్తుంది తెలంగాణ సమాజం.. తస్మాత్ జాగ్రత్త..!! అంటూ కేసీఆర్ను . హెచ్చరిస్తూ ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news