2.30 నిమిషాలతో తెలంగాణ రాష్ట్ర గీతం

-

సీఎం రేవంత్ రెడ్డి పలు పార్టీల నేతల నిర్వహించిన సమావేశం నిన్న రాత్రి ముగిసింది. తెలంగాణ రాష్ట్ర గీతం నేపథ్యంలో జరిగిన ఈ భేటీలో సీపీఐ, సీపీఎం, కోదండరామ్ అంగీకారం తెలిపారు. అయితే కమ్యూనిస్టు పార్టీలు గీతంలో ముగ్దూం మొహియుద్దీన్ ప్రస్తావన కోరారు.

Telangana State Anthem with 2.30 minutes

దీంతో సీఎం.. అందె శ్రీకి ఆ బాధ్యతలు అప్పగించారు. కాగా గీతం 2.30 నిమిషాల నిడివితో రానుంది. కాగా ఈ ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్‌ ను ఆహ్వానిస్తామని రేవంత్ చెప్పారు.

అటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల వేడుకలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది.

ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కూడా ఆహ్వానం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేసీఆర్‌కు ఆహ్వాన పత్రికను అందించాలని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌కు, డైరెక్టర్ అరవింద్ సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news