తెలంగాణ రాష్ట్రంలో బీర్ల కొరత ఎక్కడ లేదని ఎక్సైజ్ శాఖ ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కేఫ్ బ్రాండ్ తప్ప మిగతా అన్ని రకాల బీర్లు అందుబాటులో ఉన్నాయని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. బీరు తయారు చేసే కంపెనీలకు మూడో షిఫ్ట్ అనుమతించకపోవడం వల్ల… కృత్రిమ కొరత ఏర్పడిందన్న వార్తలను ఎక్సైజ్ శాఖ ఖండించింది.
అబ్బనీలు మూడు చెట్టుల్లో మొత్తం 4.98 లక్షల కేసుల బీర్లు తయారు చేయాల్సి ఉందని… 2.51 మాత్రమే తయారు చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో బీర్ల కొరత లేకుండా చేస్తామని ఎక్సైజ్ శాఖ వివరించింది.
అటు తెలంగాణలో కొత్త రకం బ్రాండ్ బీర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మార్కెట్లో కింగ్ ఫిషర్ బీర్ల కొరత ఏర్పడింది.ఈ క్రమంలోనే ప్రభుత్వం మార్కెట్లోకి కొత్త బీర్లను తీసుకొచ్చేందుకు సోమ్ డిస్టిలరీస్‌కు అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.