Hanuman Jayanti in Kondagattu: జగిత్యాల జిల్లాలో పెద్ద హనుమాన్ జయంతి హడావిడి కనిపిస్తోంది. నేడు కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి ఉంది. దీంతో భారీగా కొండగట్టుకు హనుమాన్ భక్తులు తరలివస్తున్నారు. అంజనేయస్వామిని దర్శించుకుంటున్నారు హనుమాన్ దీక్ష పరులు.
ఆలయ ప్రాంగణంలో జై శ్రీ రామ్ జై హనుమాన్ నినాదాలు చేస్తున్నారు హనుమాన్ భక్తులు. దీంతో కొండగట్టులో భారీగా నిలిచింది ట్రాఫిక్. అటు కొండగట్టు అంజన్న దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. నేడు మాల విరమణ చేయనున్నారు హనుమాన్ దీక్ష పరులు. దీంతో భక్తుల రద్దీ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అటు హను మాన్ జయంతి సందర్భంగా కడప జిల్లా పులివెందులలోని తూర్పు ఆంజనేయ స్వామి, పడమటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర అన్నదానం మరియు సాయంత్రం వీర హనుమాన్ యాత్ర అందులో పాల్గొన్నారు హనుమాన్ భక్తులు.