లోక్ సభ ఎన్నికల తుది విడత పోలింగ్ నేడు 8 రాష్ట్రాలు, ఒక UTతో కలిపి మొత్తం 57 స్థానాల్లో జరగనుంది. నరేంద్ర మోడీ, అనురాగ్ ఠాకూర్, కంగనా రనౌత్ వంటి ప్రముఖులతో సహా మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
పోలింగ్ పూర్తి అయిన తర్వాత సాయంత్రం 6:30 గంటల నుంచి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడనున్నాయి. వాటి కోసం రాజకీయ నేతలతో పాటు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్ పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126ఏ(1) ప్రకారం నిబంధనలు పాటించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కాగా ఇవాళ ఏడో విడత పోలింగ్ తో దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.