లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయి ప్రస్తుతం బెయిల్‌పై విడుదలై బయట ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ జైల్లో లొంగిపోనున్నారు. శనివారం (జూన్1వ తేదీ)తో ఆయనకు కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. అయితే వైద్య పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ఆదేశంతో దిగువ కోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. ఈ పిటిషన్‌పై దిగువ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. జూన్ 5వ తేదీన తీర్పు వెలువరించనున్నట్లు దిల్లీ కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన జైల్లో లొంగిపోనున్నారు.
దిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌కు ఎన్నికల్లో ప్రచారం కోసం సుప్రీంకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఇన్నాళ్లు బయట ఉండి పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వ కార్యకలాపాలు చూసుకున్నారు. ఇక బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌లో ఉండటంతో ఆయన ఇవాళ జైల్లో లొంగిపోక తప్పడం లేదు.