అమరుల త్యాగాలకు ఫలితం సాధించిన రోజు నేడు – హరీష్‌ రావు

-

తెలంగాణ ఆవిర్భావంపై హరీష్‌ రావు కీలక ప్రకటన చేశారు. అరవై ఏళ్ల గోసకు, సుదీర్ఘ పోరాటాలకు, అమరుల త్యాగాలకు ఫలితం సాధించిన రోజు నేడు.సబ్బండ వర్గాల ప్రజలు ఏకమై గొంతెత్తగా, తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అని తెగించి కొట్లడగా.. స్వరాష్ట్రం సాధించిన రోజు నేడు అన్నారు. తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో అనతి కాలంలోనే అగ్రస్థానానికి చేర్చిన ఘనత బిఆర్ఎస్ పార్టీది… దశాబ్దిలో శతాబ్దకాల అభివృద్ధిని చేసుకొని, అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా నిలిపింది బిఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు.

Harish Rao’s key statement on the emergence of Telangana

తొమ్మిదేళ్ళ కాలంలో…వ్యవసాయాన్ని పండుగ చేసింది….విద్యుత్ రంగాన్ని పటిష్ఠం చేసింది….విద్యా రంగాన్ని ఆదర్శంగా నిలిపిందని వెల్లడించారు. వైద్య రంగాన్ని అగ్రస్థానానికి చేర్చింది….పెట్టుబడులతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది….కరువుల బాధలు లేకుండా చేసిందన్నారు. వలసలు వాపస్ తెచ్చింది….పంట పొలాలను సస్యశ్యామలం చేసిందని వివరించారు. ఆర్థిక క్రమశిక్షణతో అభివృద్ధి చేసి ‘శభాష్ తెలంగాణ’ అని దేశం మెచ్చుకునేలా చేసిందని గుర్తు చేశారు. ఈ అభివృద్ధి, ఉద్యమ స్ఫూర్తి ఇక మీదట కూడా ఉండాలని, తెలంగాణ దేశానికి రోల్ మెడల్ గా కొనసాగాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news