తెలంగాణ ఏర్పాటులో సుష్మ స్వరాజ్ పాత్ర చాలా కీలకం..!

-

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి నేటికి 10 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో జూన్ 2 దశాబ్ది వేడుకల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అవతరణ దినోత్సవాలను పరేడ్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ పాటను తెలంగాణ రాష్ట్ర గేయంగా సీఎం రేవంత్ జాతికి అంకితమిచ్చారు.

ఈ క్రమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారిని ఆయన కొనియాడారు. ఇందులో భాగంగా ప్రత్యేక తెలంగాణ బిల్లు ఏర్పాటులో ముగ్గు మహిళలు కీలక పాత్ర పోషించారని వారిలో సోనియా గాంధీ, మీరా కుమార్, సుష్మా స్వరాజ్ పాత్రలు అత్యంత ముఖ్యమైనవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ మొట్టమొదటి త్యాగం చేశారని గుర్తు చేశారు. అలాగే లోక్ సభ స్పీకర్ గా మీరా కుమార్ సహకారం అందించారని.. నాటీ లోక్ సభలో ప్రత్యేక తెలంగాణ బిల్లుకు బీజేపీ ఎంపీ సుష్మాస్వరాజ్ సంపూర్ణ మద్దతు ఇచ్చి తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారని సీఎం రేవంత్ గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news