రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్ కి వచ్చిందా..? : మంత్రి కోమటిరెడ్డి

-

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 గంటలు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్ కి వచ్చిందా..? మల్లన్న సాగర్ నుంచి ఫామ్ హౌస్ కి నీరు తీసుకెళ్లారు. ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసి కనీసం 10 గంటలు కూడా ఇవ్వలేదన్నారు.

సింగరేణి బకాయిలు 40వేల కోట్లు ఉన్నాయి. యాదాద్రి పవర్ ప్లాంట్ పై విచారణ జరుగుతోందని తెలిపారు. బీఆర్ఎస్ దోపిడి చేసిందన్నారు. ప్రజలు శిక్షించి ఇంట్లో కూర్చోబెట్టారు. అసెంబ్లీకి వచ్చే ముఖం లేదన్నారు. అసెంబ్లీ కి రాలేదు కానీ.. నల్గొండలో సమావేశానికి హాజరై మాట్లాడారు. కేసీఆర్ తన పాలనలోనే దోపిడి చేశారు. కేసీఆర్  రాక్షస పాలనలో నీచమైన పని చేశారని మండి పడ్డారు మంత్రి కోమటి రెడ్డి. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ దోపిడి వంటివి బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news