0.7శాతం తేడాతో బీజేపీకి 63 స్థానాలకు గండి

-

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 36.6 శాతం ఓట్లు సాధించింది. 2019లో నమోదైన ఓటు శాతంతో పోలిస్తే తగ్గింది గత ఎన్నికల్లో 37.3 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే తగ్గింది 0.7 శాతం మాత్రమే అయినా సీట్ల పరంగా మాత్రం భారీగా ఆ పార్టీకి గండి పడింది. ఏకంగా 303 నుంచి 240 స్థానాలకు బీజేపీ పడిపోయింది. మొత్తంగా 63 స్థానాలు తగ్గాయి.

మరోవైపు కాంగ్రెస్‌ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. గత ఎన్నికల్లో 19.5 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ ఈసారి 21.2 శాతం ఓట్లను కైవసం చేసుకుని 1.7 శాతం ఓట్లను పెంచుకుంది. సీట్లు మాత్రం దాదాపు రెండింతలై 52 నుంచి 99కి ఎగబాకాయి. ఎన్నికల్లో ఓట్ల శాతాల్లో తేడాలు స్వల్పంగానే ఉన్నా సీట్ల విషయంలో పెద్ద వ్యత్యాసానికి దారితీస్తోంది.

తమిళనాడులో బీజేపీ ఓట్ల శాతం 2019తో పోలిస్తే 3.2 శాతం నుంచి 11.2 శాతానికి పెరిగింది. కానీ, పెరిగిన ఆ ఓట్లు ఒక్క సీటును కూడా గెలిపించలేకపోయాయి. బిహార్‌లో 23.6 శాతం నుంచి 20.5 శాతానికి కుంగడం కమలదళానికి ఐదు సీట్లకు గండికొట్టింది. బంగాల్​లో బీజేపీకు 1.6 శాతం ఓట్లు తగ్గగా, ఆరు సీట్లు కోల్పోవాల్సి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news