ఎన్డీఏ కూటమికే మా సంపూర్ణ మద్దతు : శ్రీ భరత్

-

ఎన్డీఏ కూటమికే మా సంపూర్ణ మద్దతు అని విశాఖ నుంచి నూతనంగా ఎంపీగా గెలిచిన శ్రీ భరత్ పేర్కొన్నారు. తాజాగా చంద్రబాబు నాయుడుతో టీడీపీ పార్లమెంటరీ సభ్యులు సమావేశం అయ్యారు. అనంతరం శ్రీ భరత్, విశాఖ ఎంపీ, పెమ్మాసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీ, కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం ఎంపీ మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబుతో సమావేశం కావడం చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద మెజార్టీ సాధించడానికి పరోక్షంగా వైసీపీ కూడా కారణమే. ఇంత భారీ విజయం సాధించడానికి మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు తెలుగు ప్రజల ఉన్న కసి దీనికి కారణం అన్నారు. ఎన్నికల ముందు నుంచి మేము ఎన్డీఏ కూటమితోనే కలిసి ప్రయాణిస్తున్నాం.ఎన్డీఏ కూటమికే మా సంపూర్ణ మద్దతు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అనేక అంశాల్లో వారి మద్దతు కావాలి. విశాఖ స్టీల్ కర్మాగారం అంశంతో పాటు వివిధ పార్లమెంటు నియోజకవర్గం అనేక అంశాలు పరిష్కారం కావాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news