మెట్రో రైళ్ల రాకపోకలకు అంతరాయం… ప్రయాణికులకు ఫైన్

-

బుధవారం(జూన్ 05) సాయంత్రం నగరంలో ఉరుములతో కూడిన వర్షం దీంతో మియాపూర్‌- ఎల్బీనగర్‌ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. సాంకేతిక కారణాలతోనే నిలిపివేసినట్టు లోకో పైలట్లు వెల్లడించారు.

తిరిగి 10 నిమిషాల అనంతరం మెట్రో రైలు సర్వీసులు తిరిగి ప్రారంభించారు. కాగా.. గమ్యస్థానాలకు చేరుకున్న ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. మెట్రో స్టేషన్లలో ఎక్కువ సేపు ఉండి కాలక్షేపం చేశారని ఒక్కొక్కరి నుంచి బలవంతంగా రూ.15 చొప్పున వసూలు చేశారు. ఒక ప్రయాణికుడు తాను చెల్లించిన జరిమానా రసీదును సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.సాంకేతిక లోపంతో రైలు ఆగిపోతే, జరిమానా ఎందుకు చెల్లించాలని ప్రయాణికుడు తన పోస్టులో ప్రశ్నించాడు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మెట్రో రైల్ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. “ఓవర్‌స్టేనింగ్”పై ప్రయాణికులకు విధించిన ఛార్జీలను తిరిగి చెల్లించినట్లు వెల్లడించింది. అయితే, ఎంత మంది ప్రయాణికులపై ఛార్జీ విధించారు..? ఎంతమందికి తిరిగి చెల్లించారు అనే వివరాలు వెల్లడించేందుకు మెట్రో రైల్ యాజమాన్యం నిరాకరించింది.

Read more RELATED
Recommended to you

Latest news