స్మృతి ఇరానీ పై ఫైర్ అయినా కిషోర్ లాల్ శర్మ కూతురు

-

కాంగ్రెస్ కంచుకోట అమేథీలో గాంధీ కుటుంబానికి నమ్మకస్తుడు అయిన కిషోరి లాల్ శర్మ , స్మృతి ఇరానీపై 1,60,000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.ఈ నేపథ్యంలో కిషోరి లాల్ కూతురు అంజలి,స్మృతి ఇరానీపై విమర్శలు చేశారు. ”స్మృతి ఇరానీ మా నాన్నను, ప్యూన్, ప్రాక్సీ, సేవకుడు, చీమ అని ఎలాగైనా పిలవవచ్చు.. మేము వాటిని పట్టించుకోము.. దానికి సమాధానంగా ఈ నంబర్లే మాట్లాడుతాయి అని అన్నారు.

ఆమె ప్రియాంక గాంధీ గారిని అనుకరించింది.. అది చాలా బాగుంది, స్మృతి ఇరానీ మంచి నటి” అని అంజలి ఎద్దేవ చేశారు. అంతకుముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా స్మృతి ఇరానీ ఒక సమావేశంలో కిషోరి లాల్ శర్మను ”ప్యూన్” అని “ప్రియాంక గాంధీ “గుమాస్తా” అని విమర్శలు చేసింది. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గా కిషోర్ లాల్ శర్మ చిన్న కుమార్తె అంజలి ఇరానీపై అన్న వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎన్నికల్లో గెలిచిన అనంతరం శర్మ మాట్లాడుతూ, ఇది అమేథీ ప్రజలు, గాంధీ కుటుంబం విజయమని ,అమేథీ నియోజకవర్గం గాంధీ కుటుంబానికి చెందింది. వారు నాపై ఉంచిన నమ్మకానికి ఎలాంటి భంగం కలగకుండా చూసుకుంటానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news