మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి స్పెషల్ గెస్టులు వీరే

-

జూన్‌ 9వ తేదీన భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరయ్యే అతిథులపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, విదేశీ నేతలు, ప్రతిపక్ష సభ్యులు, సినీ, క్రీడారంగ ప్రముఖులు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సహా మరికొంత మందిని ముఖ్య అతిథులుగా  ఆహ్వానించనున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే?

మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు ట్రాన్స్‌జెండర్లు, కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి పని చేసిన శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులు, వందే భారత్ రైళ్లు వంటి కీలక ప్రాజుక్టుల్లో పని చేసిన వారు హాజరు కానున్నారు. భారత దేశాభివృద్ధికి తోడ్పడుతున్న వీరందరినీ మోదీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇప్పటికే వివిధ దేశాధినేతలు తమకు ఆహ్వానాలు అందినట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాను మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన వెంటనే దేశాన్ని మరింత అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తానని మోదీ ఎన్నికల ర్యాలీలో ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news