ఈపీఎఫ్ క్లెయిమ్‌ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) మార్గం ఈజీ అయింది. ఇక నుంచి క్లెయిమ్‌లు ఈజీగా పరిష్కారమవుతాయి. క్లెయిమ్‌తో పాటు చెక్, బ్యాంకు పాస్‌పుస్తకం కాపీ ఇవ్వలేదంటూ క్లెయిమ్ తిరస్కరించకుండా చందాదారులకు వెసులుబాటు కల్పించింది. అయితే చందాదారుడి బ్యాంకు ఖాతా వివరాల కేవైసీ ఆమోదించిన వారికే ఈ సదుపాయం లభిస్తుందని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది.
చందాదారుడి ఖాతా వివరాలను బ్యాంకు, ఎన్‌పీసీఐ ఆధార్ కేవైసీ ద్వారా ధ్రువీకరణ పూర్తయిన క్లెయిమ్‌లకు చెక్, బ్యాంకు పాసుపుస్తకం జతచేయాల్సిన అవసరం లేదని ఈపీఎఫ్‌వో తెలిపింది. ఆధార్ కేవైసీ పూర్తయిన చందాదారుల క్లెయిమ్‌లపై ‘బ్యాంకు కేవైసీ ఆన్‌లైన్లో ధ్రువీకరణ పూర్తయిందని చెప్పింది. చెక్, పాస్ పుస్తకం జత చేయాల్సిన అవసరం లేదంటూ క్లెయిమ్ దరఖాస్తులో నోట్ ఉంటుందని ఈపీఎఫ్‌వో వెల్లడించారు. ఈ సమాచారం ఆధారంగా క్లెయిమ్ దరఖాస్తులు పరిష్కరించాలని బ్యాంక్ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది.