ఏపీ విద్యార్థులకు శుభవార్త..ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించింది కొత్త ఏర్పాటు కాబోతున్న చంద్రబాబు సర్కార్. ఇవాళ ఏపీలో స్కూళ్లకు విద్యా శాఖ సెలవుదినంగా ప్రకటించింది. రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా.. సీఎస్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, ఇవాళ స్కూళ్లు పునఃప్రారంభం కానుండగా.. అది మరుసటి రోజు అనగా 13వ తేదీన పాఠశాలలు రీఓపెన్ కానున్నాయి. ఇక అటు ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టబోతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇవాళ ఉదయం 11.27 నిమిషాలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరుకానున్నారు. కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో వస్తారు.