కేసీఆర్ పై కేసు నమోదు.. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

-

కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారు. కాసేపటి క్రితమే ఈడీ కేసీఆర్ పై కేసు నమోదు చేసిందని మెదక్ ఎంపీ రఘునందన్  రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, హరీశ్ రావు, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి ముందుంది ముసుళ్ల పండుగ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లో ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేసినా గెలవడు అన్నారు. 

గొర్రెల స్కామ్ లో ఈడీ కేసీఆర్ కి నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ మీద కేసు రిజిస్ట్రర్ అయిందని రఘునందన్ రావు తెలిపారు.  వెంకట్రామిరెడ్డి ఏమైనా మెదక్ వాడా.. మెదక్ లో 200 కోట్లు ఖర్చు చేసినా.. 500 కోట్లు ఖర్చు చేసినా  బీఆర్ఎస్ ఓడిపోయింది. ఖర్చు చేసిన డబ్బులు అన్ని కక్కిస్తామని తెలిపారు రఘునందన్ రావు.   ప్రజలు ఎవ్వరు మంచోళ్లో వారినే గెలిపించారు. అన్యాయం చేసినోడినే ఓడించారు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ డైలాగ్ ను గుర్తు చేస్తూ.. రఘునందన్ రావు హరీశ్ రావు, వెంకట్రామిరెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ లపై విమర్శలు చేశారు. దుబ్బాకలో ఓడించొచ్చు కానీ.. మెదక్ లో ఓడించలేరని సెన్షేషన్ కామెంట్స్ చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news