విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఎందుకు ఉండాలి? : పరిగి ఎమ్మెల్యే

-

విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఎందుకు ఉండాలి? అంటూ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు .శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ… మాజీ ముఖ్యమంత్రి పేరును ముద్రించిన అధికారులకు ఇప్పటికే ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారని అన్నారు.

మొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా పాఠ్య పుస్తకాలతో పాటు, నోట్ బుక్స్‌ను అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నా, మహిళా సంఘాల ద్వారా పంపిణీ చేశామన్నారు. పుస్తకాలలో మాజీ సీఎం పేరు గుర్తించి కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లామని తెలిపారు. అయితే కేసీఆర్ పేరు ఉంటే తప్పేమీ? అని మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన చెప్పారు. ఎమ్‌ఈవో కార్యాలయంలోనే మొదటి పేజీ తొలగించి, మరో పేజీని జత చేస్తున్నామని తెలిపారు.విద్యార్ధులకు సరైన సమాచారం ఉండాలని, లేకుంటే ఇబ్బందులు పడతారన్నారు పరిగి ఎమ్మెల్యే. తెలుగు సబ్జెక్టులోని ఓల్డ్ స్టాక్ బుక్స్‌లో మాత్రమే ఈ తప్పు జరిగిందని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news