టెస్లాకారును హ్యాక్ చేయొచ్చు.. మస్క్ కామెంట్స్ బీజేపీ కౌంటర్..!

-

ఈవీఎంలు హ్యాకింగ్ కు గరవుతున్నాయని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ చేసి ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. ఈ ఆరోపణలపై కేంద్రమాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఈవీఎంలను హ్యాక్ చేసే ఛాన్స్ ఉందంటే.. టెస్లా కార్లను హ్యాక్ చేసే వీలుంటుందని మస్క్ కౌంటర్ ఇచ్చారు. “క్యాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ టోస్టర్నే తీసుకోండి.. వాటిని హ్యాక్ చేయలేం.. ఈవీఎంలు కూడా అలాంటివే” విమర్శించారు. ఈవీఎంలు కేవలం ఓట్లను లెక్కించి.. రిజల్ట్ ని స్టోర్ చేస్తాయని వివరించారు. తాను మస్ను కాకపోయినప్పటికీ, సాంకేతికతపై తనకు కాస్త పరిజ్ఞానం ఉందన్నారు. ఈ ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ఎలక్ట్రానిక్, డిజిటల్ పరికరమేదీ ఉండదన్నారు. టెస్లా కారునూ హ్యాక్ చేయొచ్చని ఎవరైనా చెప్పొచ్చు అని విమర్శలు గుప్పించారు.

అమెరికా నియంత్రణలోని ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆందోళన వ్యక్తంచేసిన మస్క్.. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడం ద్వారా హ్యాకింగ్ను నివారించొచ్చని సూచించారు. దీనిపైనే కేంద్ర మాజీమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. భారత ఈవీఎంలకు బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ తో.. కనెక్టివిటీ ఉండదని, వీటిని రీప్రోగ్రామ్ చేయడం కూడా కుదరదని ఆయన బదులిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news