Delhi: బిభవ్ కుమార్‌ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

-

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు, మాజీ మహిళా కమిషనర్ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యక్తిగత సహయకుడు బిభవ్ కుమార్‌ జ్యుడీషియల్ కస్టడీని మరోసారి జులై 6వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తీస్ హజారీ కోర్టు స్పష్టం చేసింది. బిభవ్ కుమార్‌ను శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీస్ హజారీ కోర్టు ఎదుట పోలీసులు హాజరుపరిచారు.మే 13 న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో ఎంపీ స్వాతి మలివాల్‌పై బిభవ్ కుమార్ దాడి చేశారు. అనంతరం అతడిపై పోలీసులకు స్వాతి మలివాల్‌ ఫిర్యాదు చేసింది.

మే 16వ తేదీన బిభవ్ కుమార్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి మే 18న బిభవ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బిభవ్ కుమార్ బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎంపీ స్వాతి మలివాల్‌కు వచ్చిన బెదిరింపులను కోర్టు పరిగణనలోకి తీసుకుని బిభవ్ కుమార్ బెయిల్ దరఖాస్తును తీస్ హజారీ కోర్టు కొట్టి వేసింది. తాను రుతుక్రమంలో ఉన్నానని చెప్పినా.. అత్యంత దారుణంగా బిభవ్ కుమార్ దాడి చేసినట్లు స్వాతి మాలివాల్ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. సున్నితమైన అవయవాలపై దాడి చేసినట్లు, అందరూ చూస్తుండగానే ఈ దాడి జరిగిందని.. ఎవరూ కూడా ఆపే ప్రయత్నం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news