వివాదంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నిర్మాణ సంస్థ

-

ప్రముఖ సినీ నిర్మాత, సినీనటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ భర్త జాకీ భగ్నాని నిర్మాణ సంస్థ పూజా ఎంటర్‌టైన్‌మెంట్  వివాదంలో చిక్కుకుంది. నిర్మాణ సంస్థ తమకు ఇవ్వాల్సిన వేతనాలను చెల్లించట్లేదని సంస్థ సిబ్బంది సోషల్‌ మీడియా వేదికగా ఆరోపణలు చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. వారు తీసిన సినిమాకు బడ్జెట్‌ ఎక్కువయినందువల్ల తమకు వేతనాలు చెల్లించలేకపోతున్నామని నిర్మాణ సంస్థ తెలిపినట్లుగా అందులోని ఓ సభ్యురాలు ఆవేదన వ్యక్తం చేశారు.  తాము కష్టపడి చేసిన పనికి చెల్లించాల్సిన జీతాలను ఏడాది కాలంగా ఇవ్వకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారిందని వాపోయారు. అందువల్లే ఈ విషయాన్ని బయటకు చెప్పక తప్పట్లేదన్నారు.

నేను పూజ ప్రొడక్షన్స్ లో ప్రొడక్షన్ డిజైన్ వర్కర్ గా పని చేస్తున్నాను. రెండేళ్ల క్రితం దాదాపు 100 మంది సిబ్బందితో కలిసి ఓ సినిమాలో పని చేశాను. ప్రస్తుతం వారందరూ రెండు నెలల జీతం కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు. ప్రాజెక్ట్‌లో పని చేసిన నటీనటులకు వెంటనే డబ్బు చెల్లించిన సంస్థ తమ వద్దకు వచ్చే సరికి సాకులు చెప్తూ వేతనాలు ఇవ్వట్లేదు అని బాధితురాలు మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news