చిత్తూరు జిల్లా కుప్పం పసుపు మయంగా మారింది. రేపు, ఎల్లుండి కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటనకు వెళుతున్నారు. ముఖ్య మంత్రి అయిన తర్వాత… మొదటి సారిగా రేపు, ఎల్లుండి సీఎం చంద్రబాబు పర్యటనకు వెళుతున్నారు. ఇక సీఎం చంద్రబాబు పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు టిడిపి నేతలు.
కుప్పం పట్టణంలో రోడ్డు పొడువునా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు. సీఎం పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. గత ప్రభుత్వంలో పనిచేసిన సిఐ,ఎస్ ఐలను విఆర్ కు పంపారు ఎస్పీ.
ఇది ఇలా ఉండగా, కేబినెట్‌లో పెన్షన్ల పెంపు అంశంపై చర్చ జరిగింది. రాష్ట్రంలో జులై 1 నుంచి పెంచిన పెన్షన్లు అమలు చేయాలని నిర్ణయించారు. రూ.3వేల నుంచి రూ.4వేలకు పెన్షన్ల పెంపును ఆమోదించారు. ఏప్రిల్ నుంచి ఉన్న పెన్షన్ బకాయిలు రూ. 3 వేలను ప్రభుత్వం చెల్లించనుంది. దీంతో వచ్చే నెలలో ఒకేసారి రూ.7వేలను 65 లక్షల మంది లబ్ధిదారులు అందుకోనున్నారు.