సైకిల్ పై పార్లమెంట్ కు చేరుకున్న టీడీపీ ఎంపీ !

-

సైకిల్ పై పార్లమెంట్ కు..వెళ్లారు విజయనగరం ఎంపీ. ఇప్పుడు ఈ సంఘటన హాట్‌ టాపిక్‌ అయింది. తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టనున్న… విజయనగరం ఎంపీ..సైకిల్ పై పార్లమెంట్ కు..వెళ్లారు. ఢిల్లీలోని తన అతిధి గృహం నుంచి సైకిల్ పై పార్లమెంట్ కు చేరుకున్నారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు. ఇక ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

కాగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. మొదటగా ఏపీకి చెందిన శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు లోక్​సభ సభ్యుడిగా తెలుగులో ప్రమాణం చేశారు. అనంతరం కేంద్ర బొగ్గ గనుల శాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కూడా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత లోక్​సభ సభ్యులుగా ఏపీకి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్, తెలంగాణకు చెందిన కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news