పేపర్ లీకులు చేసేవారిపై కఠిన చర్యలు..ఆమోదం తెలిపిన యూపీ సర్కారు

-

నీట్, యూజీసీ-నెట్ పేపర్ లీక్ కేసులు దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ప్రతిపక్షాలు, పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాయి.ఈ ఆందోళనల మధ్య పరీక్ష బాధ్యతలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్మాణం, పనితీరు, పాదర్శకతను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

ఇదిలా ఉంటే, పేపర్ లీకులను అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు లీకులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కఠిన చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కేసుల్లో దోషులుగా తేలిన వ్యక్తులకు జీవిత ఖైది విధించనుంది. అంతేకాకుండా రూ. 1కోటి వరకు జరిమానా విధించాలనే కఠిన చట్టాన్ని తీసుకువస్తోంది. సీఎం యోగి అధ్యక్షతన జరిగిన ఉత్తరప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాల నివారణ) ఆర్డినెన్స్ 2024కి ఉత్తర ప్రదేశ్ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు లేనందుకున ఆర్డినెన్స్ తీసుకువచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news