కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి వెన్నుదన్నుగా ఉన్నారు – సీఎం రేవంత్‌

-

కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి వెన్నుదన్నుగా ఉన్నారని సీఎం రేవంత్‌ తెలిపారు. ఇవాళ జీవన్‌ రెడ్డితో సమావేశం అయిన తర్వాత ఢిల్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…రెండు మూడు రోజులుగా తెలంగాణ లో , కాంగ్రెస్, ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు….వివిధ అంశాలపై మీడియా లో వార్తలు వస్తున్నాయని తెలిపారు.

cm revanth on jeevan reddy

ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల దృష్ట్యా, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లోకి వచ్చారన్నారు. కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి వెన్నుదన్నుగా ఉన్నారు… ఈ విషయంలో జీవన్ రెడ్డి గారు మనస్తాపానికి గురి అయ్యారని వెల్లడించారు.

మా వైపున , పీసీసీ నుంచి సమన్వయం చేయడంలో గందర గోళం ఏర్పడింది… కాంగ్రెస్ అధిష్టానం సైతం జీవన్ రెడ్డి గారితో చర్చించిందని పేర్కొన్నారు. జీవన్ రెడ్డి గారి గౌరవానికి భంగం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు… జీవన్ రెడ్డి గారు రెట్టించిన ఉత్సాహం తో పని చేస్తారన్నారు. కొందరు నక్కలు, ఏదయినా జరిగితే బాగుండు అని చూస్తున్నారు… జీవన్ రెడ్డి గారు గుంట నక్కలకు అవకాశం ఇవ్వలేదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news