ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారు: రాష్ట్రపతి ముర్ము

-

పార్లమెంటు సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో భాగంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె కొత్తగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలిపారు. దేశ ప్రజల విశ్వాసం గెలిచి సభకు ఎన్నికయ్యారని.. ప్రజాస్వామ్య పరిరక్షణలో సభ్యులు విజయవంతమవుతారని ఆశిస్తున్నానని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు సజావుగా జరిగాయని పేర్కొన్నారు. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించిన ఈసీని అభినందించారు.

‘సభ్యులంతా దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారు. ప్రపంచమంతా భారత ఎన్నికలను నిశితంగా పరిశీలించింది. ప్రజలు ప్రభుత్వాన్ని విశ్వసించి మళ్లీ పట్టం కట్టారు. ప్రజలు ప్రభుత్వ సుస్థిరత, నిజాయితీని నమ్మారు. దేశంలో సంస్కరణలు మరింత వేగవంతమవుతాయి. ఎన్నికల్లో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం పదేళ్లలో సుస్థిర అభివృద్ధిని చేసింది. జమ్ముకశ్మీర్‌లో ప్రజలు పెద్దసంఖ్యలో ఓటు వేశారు. రిఫార్మ్‌, పర్‌ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌ ఆధారంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అయ్యింది. పెట్టుబడులు, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుంది.’ అని రాష్ట్రపతి ముర్ము అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news