మోదీ సర్కార్ శత్రువులకు కశ్మీర్‌ లోయ గట్టి జవాబిచ్చింది : రాష్ట్రపతి ముర్ము

-

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం పదేళ్లలో సుస్థిర అభివృద్ధిని సాధించిందని అన్నారు. జమ్మూకశ్మీర్‌పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారని.. కానీ, ఈసారి కశ్మీర్‌ లోయలో మార్పు కన్పించిందని తెలిపారు. శత్రువుల కుట్రలకు అక్కడ ప్రజలు గట్టిగా బదులిచ్చారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ప్రజలు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడం విశేషమని ముర్ము పేర్కొన్నారు.

రిఫార్మ్‌, పర్‌ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌ (సంస్కరణలు, పనితీరు, మార్పు) ఆధారంగా ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని ముర్ము అన్నారు. ఆర్గానిక్‌ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరిగిందని.. డిమాండ్‌ మేరకు భారత్‌ ఉత్పత్తులు అందిస్తోందని తెలిపారు. ఆరోగ్య రంగంలో భారత్‌ అగ్రగామిగా ఉందన్న రాష్ట్రపతి.. భారత్‌ వేగంగా పురోభివృద్ధి సాధిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. చిన్న, సన్నకారు రైతుల కోసం పీఎం సమ్మాన్‌ నిధి తీసుకువచ్చామని.. ప్రజా సంక్షేమం కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చామని వెల్లడించారు. ప్రపంచ వృద్ధిలో భారత్‌ 15 శాతం భాగస్వామ్యం అవుతోందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news