ఏపీ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు నూతనంగా ఎన్నికైన ఎన్డీఏ  ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పాటు సెలవులు ఉండేవి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్  సచివాలయం, హెచ్ ఓడీ లలో వారానికి ఐదు రోజుల పని దినాల విధానం ఈ నెల 27వ తేదీతో ముగుస్తుంది.

అయితే ఈ విధానాన్ని మరికొంత కాలం పొడిగించాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం కోరింది. సచివాలయ ఉద్యోగుల సంఘం కోరిన వెంటనే  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ఆమోదం తెలిపారు. ఇవాళ లేదా రేపు అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని పొడిగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి  ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పలువురు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news