భార్యా భర్తలు ఒకే గదిలో పడుకుంటారు.. నిద్రలో తెలియకుండానే ఎవరికీ వారే అన్నట్లు పడుకుంటారు.. అలా పడుకోవడం వల్ల దూరం ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు.. అందుకే ఎన్ని గొడవలు వచ్చినా ఇద్దరు కౌగిలించుకొని పడుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. కౌగిలించుకొని పడుకోవడం వల్ల కలిగే లాభలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పార్టనర్‌ని కౌగిలించుకుని పడుకుంటే.. రాత్రంతా హాయిగా నిద్రపోతారు. దీంతో ఒత్తిడి, గందరగోళం తగ్గుతుంది. ఇద్దరి మనసు ఆనందంగా ఉంటుంది. ఉల్లాసంగా ఉంటారు. మరుసటి రోజు ఉదయం చాలా రీఫ్రెషింగ్‌గా ఉంటారు..
అలాగే హ్యాపీ హార్మోన్ అనేది విడుదల అవుతుంది.. శరీరం ఆక్సిటోసిన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్‌ని విడుదల చేస్తుంది. ఇది భార్యాభర్తలకి ఆనందాన్నిస్తుంది..
భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఇలా పడుకుంటే శృంగారపు కోరికలు పెరుగుతాయి.. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. ఇది మీ శరీరంలోని ఇన్ఫెక్షన్స్‌ని దూరం చేస్తుంది. మంటని కూడా తగ్గిస్తుంది.. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది..
అంతేకాదు మీ రిలేషన్ బలంగా ఉండాలంటే మీకు, మీ భాగస్వామికి మధ్య కమ్యూనికేషన్ అవసరం.. అందుకే ప్రతిరోజు ఇలా కౌగిలించుకొని పడుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు… అంతేకాదు భార్యా భర్తల బంధం బలపడాలి అంటే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి.. అప్పుడే ఎటువంటి అపార్థాలు రాకుండా ప్రేమ పెరుగుతుంది..