జూన్లో తక్కువైనా జులైలో సాధారణానికి మించి వర్షాలు: ఐఎండీ

-

దేశంలో ఈ నెలలో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. ఈశాన్య, వాయవ్య, తూర్పు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా అన్నిచోట్లా ఇలాగే ఉంటుందని అంచనా వేసింది. జూన్లో వర్షాలు అంచనా మేరకు కురవకపోయినా.. జులైలో దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 28.04 సెం.మీ. కాగా ఈసారి అంతకుమించి (106% మేర) వానలు పడతాయని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు. పశ్చిమ హిమాలయాల్లో, మధ్య భారతంలో వరదలు సంభవించే అవకాశాలు ఎక్కువని వెల్లడించారు. గోదావరి, మహానది బేసిన్లలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడతాయని చెప్పారు.

మరోవైపు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం, అంతకన్నా ఎక్కువ వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వ్యవసాయం, నీటి వనరులకు ప్రయోజనం చేకూరుస్తుందని వెల్లడించారు. వరదలు, రవాాణ దెబ్బతినడం, ప్రజారోగ్య సవాళ్లు, పర్యావరణ వ్యవస్థ నష్టం వంటి ప్రమాదాలను తెస్తుందని హెచ్చరించారు. రుతుపవనాల సీజన్‌ రెండో భాగంలో లానినా పరిస్థితులు అభివృద్ధి చెందే అవకాశం ఉందని … ఈనెల 4 నుంచి సమృద్ధిగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news