ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కూటమి ఖరారు చేసింది. టీడీపీ నుంచి సి. రామచంద్రయ్య, జనసేన నుంచి పిడుగు హరిప్రసాద్‌కు అవకాశం కల్పించారు. వీరిద్దరూ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం వీరిద్దరూ ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. అయితే.. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం లో కష్టపడిన వర్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారని అందరూ భావించారు.
కానీ టీడీపీ నుంచి సి. రామచంద్రయ్య, జనసేన నుంచి పిడుగు హరిప్రసాద్‌కు అవకాశం కల్పించారు చంద్రబాబు. కాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థులుగా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు సి.రామచంద్రయ్య, హరిప్రసాద్. శాసనసభలో కూటమికి ఉన్న సంఖ్యా బలం దృష్ట్యా ఏకగ్రీవం కానుంది సి.రామచంద్రయ్య, హరిప్రసాద్ ఎన్నిక. కాగా ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరారు ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, షేక్ మహ్మద్ ఇక్బాల్. దీంతో ఆ స్థానాలకు ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.