డ్రగ్స్ కట్టడిపై సీఎం రేవంత్‌ సూచన.. స్పందించిన మోహన్‌ బాబు

-

సినిమా షూటింగ్‌లు, టికెట్ల రేట్లు పెంచునేందుకు అనుమతి కోరే ముందు సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్, సైబర్ నేరాలపై ఆయా సినిమాల నటీనటులు అవగాహన వీడియోలు తీసి ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షరతు విధించిన విషయం తెలిసిందే. సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ కట్టడిపై తెలుగు చలన చిత్ర పరిశ్రమ అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ సూచనలపై ప్రముఖ నటుడు మోహన్‌ బాబు స్పందిస్తూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.

‘‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి డ్రగ్స్‌కు యువత బలి అవుతున్న విషయం గురించి మాట్లాడుతూ.. సినిమా నటీనటులను 1 లేదా 2 నిమిషాల నిడివిలో వీడియో చేసి, ప్రభుత్వానికి పంపమన్నారు. ఇంతకుముందే ఇటువంటి వీడియోలు కొన్ని చేశాను. అయినా సీఎం ఆదేశం మేరకు సందేశాత్మకమైన కొన్ని వీడియోలు రూపొందించి, ఉడతా భక్తిగా సమాజానికి సేవ చేసుకుంటానని తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. తన పోస్ట్‌కు రేవంత్‌, సీఎంఓ ఎక్స్‌ ఖాతాలను మోహన్ బాబు ట్యాగ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news