తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణంగా విఫలమవుతోంది. అధికారం చేపట్టినప్పటి నుంచి… ప్రభుత్వంలో ఉన్న లుకలుకలు బయట పడుతున్నాయి. కరెంటు కోతలు, నీటి సమస్యలు, రైతుల ఆర్తనాదాలు ఇలా చెప్పుకుంటూ పోతే… రేవంత్ రెడ్డి పాలనలో అనేక సమస్యలు వస్తున్నాయి.
అయితే తాజాగా… చల్లని కళ్యాణ లక్ష్మి చెక్కు అందించారు ఓ తహసిల్దార్. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కోటపల్లి మండలంలో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాలకు చెందిన సరిత శ్రీనివాస్ దంపతుల కూతురు వివాహం 2023 ఫిబ్రవరి 23వ తేదీన జరిగింది.
అయితే ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మి ఈ కుటుంబం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ తరుణంలోనే సరిత పేరుతో 2024 ఏప్రిల్ మూడవ తేదీన… కళ్యాణ లక్ష్మి చెక్కు మంజూరు అయింది. అయితే ఆ చెక్కు ను లబ్ధిదారుకు మూడు నెలల తర్వాత వచ్చింది. ఆ చెక్కును బ్యాంకులో… చెల్లదని అధికారులు బయటకు పంపించేశారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.