బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం

-

బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దాదాపు 46.5 మిలియన్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 40వేల పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 650 ఎంపీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. అయితే ఈ ఎన్నికల్లో మెజార్టీ సాధించాలంటే 326 సీట్లు అవసరం ఉంటుంది.

ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(44) ప్రాతినిధ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ పట్ల ఓటర్లు వ్యతిరేకంగా ఉన్నట్లు పలు సర్వేల్లో తేలింది. విపక్ష లేబర్ పార్టీవైపు ఈ సారి ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. బ్రిటన్లో ఇప్పటికీ బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల నుంచి గుర్తింపు కార్డును పోలింగ్ బూత్కు తీసుకెళ్లడం తప్పనిసరి చేసింది అక్కడి ప్రభుత్వం. బ్రిటన్లో ప్రవాస భారతీయులు కూడా భారీ సంఖ్యలో ఉండటంతో వీరూ కూడా అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నారు. యూకేలో 19 లక్షల మంది భారతీయ మూలాలున్న ఉన్నవారు నివసిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news