నేడు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి మీటింగ్…ఈ అంశాలపై చర్చ

-

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం రేవంత్, చంద్రబాబు హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా ఇవాళ సమావేశం కాబోతున్నారు. తాజాగా ఇరు రాష్ట్రాల సీఎంల భేటీకి ముహూర్తం ఖరారు అయ్యింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్, చంద్రబాబు ప్రజా భవన్ వేదిగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో గత పదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలపై చర్చించనున్నారు.

CM Revanth, Chandrababu today held a meeting at Praja Bhavan in Hyderabad

ప్రధానంగా విభజన చట్టం షెడ్యూల్ 9 లోని 23 సంస్థలు, షెడ్యూల్ 10లోని 30 సంస్థల విభజనపై రేవంత్, బాబు డిస్కస్ చేయనున్నారు. వీటితో పాటు విద్యుత్ బకాయిలు, ఐదు గ్రామాల విలీన ప్రక్రియ గురించి మాట్లాడనున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బాబు.. రాష్ట్ర విభజన సమస్యలపై ఫోకస్ పెట్టారు.

ఈ నేపథ్యంలోనే ముఖాముఖీ భేటీ అయ్యి విజభన అంశాలపై చర్చిద్దామని తెలంగాణ సీఎం రేవంత్కు లేఖ రూపంలో ప్రతిపాదన పంపారు. చంద్రబాబు ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించిన రేవంత్.. భేటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇవాళ ప్రజాభవన్ వేదికగా సాయంత్రం 4 గంటలకు భేటీ కాబోతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news