మరికొన్ని గంటల్లో భారీ వర్షాలు..ఎల్లో అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

-

తెలంగాణ రాష్ట్రం ప్రజలకు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.అలాగే రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా కామారెడ్డి, వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్,నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, నారాయణపేట, సిద్దిపేట,గద్వాల్ జిల్లాల్లో ఇవాళ సాయంత్రం, రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో పైన తెలిపిన జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ 2 రోజుల్లో భారీ వర్షంతో పాటు ఈదురు గాలులు కూడా విస్తాయని తెలపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

అలాగే జిల్లా యంత్రంగాలను అధికారులు అప్రమత్తం చేశారు. వర్షాలు కురిసే సమయంలో ఎవరు బయటకు వెళ్లోద్దని తెలిపారు. ముఖ్యంగా విద్యుత్ స్థంబాలకు దూరంగా ఉండాలని, నగరాల్లో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news