ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. రెండ్రోజుల పాటు చార్‌ధామ్ యాత్రను రద్దు

-

ఉత్తరాఖండ్‌లోని గర్హాల్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు రెండు రోజుల పాటు చార్‌ధామ్‌ను యాత్రను నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భక్తుల భద్రత దృష్ట్యా ఆది, సోమవారం (జులై 7వ తేదీ, 8వ తేదీన) యాత్రను రద్దు చేసినట్లు గర్హాల్ జిల్లా ఎస్పీ వినయ్‌ శంకర్ పాండే వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎస్పీ వినయ్ శంకర్ పాండే మాట్లాడుతూ రిషికేశ్‌ దాటి భక్తులు ఎవరూ ముందుకు సాగవద్దని సూచించారు. రిషికేశ్‌ను దాటిన వారు వాతావరణం అనుకూలించే వరకు వేచి ఉండాలని చెప్పారు. గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బద్రీనాథ్ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడుతున్నాయని పేర్కొన్నారు. శనివారం రోజున బద్రినాథ్‌ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో చమోలీ జిల్లాలోని చటవాపీపల్ వద్ద కొండ చరియలు విరిగి పడి ఇద్దురు హైదరాబాదీలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చార్ధామ్ యాత్ర విషయంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news