184 దేశాలు.. 10వేల అథ్లెట్లు.. పారిస్ ఒలింపిక్స్ వివరాలు ఇవే

-

క్రీడా ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్ క్రీడల ఆరంభానికి సమయం సమీపిస్తోంది. జులై 26 నుంచి పారిస్లో ప్రారంభం కానున్న ఈ క్రీడలకు రంగం సిద్ధం అవుతోంది. 2020 టోక్యో ఒలింపిక్స్ను కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండా నిర్వహించారు. కానీ పారిస్ ఒలింపిక్స్‌ 2024కు ఈసారి వేలాదిమంది అభిమానులు తరలిరానున్నారు. విశ్వ క్రీడలు సమీపిస్తున్న వేళ అయితే పారిస్‌ ఒలింపిక్స్ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీ కోసం.

పారిస్ ఒలింపిక్స్‌ 2024 విశేషాలు..

పారిస్ 2024 ఒలింపిక్స్ జులై 26 న ప్రారంభమై ఆగస్టు 11న ముగుస్తాయి.

32 క్రీడలు 45 విభాగాల్లో 329 ఈవెంట్‌లు నిర్వహించనున్నారు.

184 దేశాల నుంచి 10,000 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు.

ఈసారి ఒలింపిక్స్‌లో బ్రేక్ డ్యాన్స్‌ను మొదటిసారిగా ప్రవేశపెట్టారు.

పారిస్ 2024 జూలై 26 శుక్రవారం ఆరంభ వేడుకలతో ఘనంగా ప్రారంభం అవుతుంది.

ప్రారంభ వేడుకలు పాంట్ డి ఆస్టర్‌లిట్జ్, పాంట్ డి ఐనాల్లో జరుగుతాయి.

మొత్తం 329 బంగారు పతకాల కోసం అథ్లెట్లు పోటీపడనున్నారు.

భారత్ 15 విభాగాల్లో పాల్గొంటుండగా, దాదాపు 100 మంది అథ్లెట్లు పతకాల కోసం పోటీపడనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news