ఈ నెల 12న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

-

బీజేపీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 12వ తేదీన జరగనుంది. హైదరాబాద్‌ శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు కన్వెన్షన్ లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ సంస్థాగత జాతీయ సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ నెల 12వ తేదీన జరిగే విస్తృత స్థాయి సమావేశంపై… రాష్ట్ర పదాధికారుల సమావేశంలో చర్చించినట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి తెలిపారు.

ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికలు, బీజేపీ సభ్యత్వం, సంస్థాగత ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించారు. మరోవైపు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞత తెలిపేలా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ధన్యవాద తీర్మానాలను చేయనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news