హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో ఇండియా జింబాబ్వేపై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 6 నీకు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. జింబాబ్వే జట్టులో మయర్స్ హాఫ్ సెంచరీ(65*)తో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో సుందర్ 3, అవేశ్ 2, ఖలీల్ ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ 5 టీ20ల సిరీస్లో 2-1 ఆధిక్యం సాధించింది.
కాగా, తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకి ఓపెనర్లు శుభారంభాన్నే అందించారు. యశస్వీ, శుభ్‌మన్ గిల్ తొలి వికెట్‌కి 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.శుభ్‌మన్ గిల్ (66) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టగా.. రుతురాజ్ గైక్వాడ్ (49), యశస్వీ జైస్వాల్ (36) ఆకట్టుకున్నారు.దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.అభిషేక్ శర్మ (10) మాత్రం ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు.ఇక జింబాబ్వే బౌలర్లలో ముజరబాని, సికందర్ రజా తలా రెండు వికెట్లు తీశారు.