Nursery lessons in Telangana Anganwadi centers: తెలంగాణ అంగన్‌వాడీ కేంద్రాల్లో నర్సరీ పాఠాలు ఉండబోతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ పాఠాలు బోధించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు.
మహిళా భద్రత, చైల్డ్ కేర్ పై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. దేశంలోనే తొలిసారిగా చిన్నారులకు యూనిఫామ్ లు అందిస్తామన్నారు. అంగన్ వాడీల్లో చిన్నారుల సంఖ్యను పెంచేందుకు ‘అమ్మ మాట-అంగన్వాడీ బాట’ పేరుతో జులై 15 నుంచి వారం రోజుల పాటు కార్యక్రమం చేపడతామన్నారు.
మీ పిల్లల భద్రత మా బాధ్యత అనే నమ్మకాన్ని తల్లిదండ్రుల్లో కలిగించేలా అంగన్వాడీ కేంద్రాలు పని చేయాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన వస్తువులు అందేలా జిల్లా సంక్షేమ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని,నాసిరకం వస్తువులు వస్తే అంగన్వాడీ టీచర్లు తిరస్కరించాలని.. నాసిరకం సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.