జీ న్యూస్ రిపోర్టర్ శ్రీ చరణ్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మన్నే క్రిశాంక్ పరామర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీలో గత కొద్ది రోజుల నుంచి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కవరేజ్ కోసం వెల్లిన జీ తెలుగు విలేకరీని, కెమెరా మెన్ ను పోలీసులు కొట్టారు. ఓయూలో కవరేజ్ కోసం వెళ్లిన జీ తెలుగు రిపోర్టర్‌ను చొక్కా పట్టుకొని లాక్కెళ్లి వాహనం ఎక్కించారు పోలీసులు.
ఈ తరుణంలోనే.. అతన్ని పోలీసులు కొట్టడం జరిగింది. ఇక పోలీసుల దెబ్బలకు సొమ్మసిల్లి పడిపోయాడు జీ న్యూస్ రిపోర్టర్ శ్రీ చరణ్. వీపు, వెన్నుపూస భాగంలో, కుడికాలు నొప్పితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు రిపోర్టర్ శ్రీ చరణ్. అయితే… పోలీసుల దాడిలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జీ న్యూస్ రిపోర్టర్ శ్రీ చరణ్ ను ఫోన్లో పరామర్శించి.. జర్నలిస్టుల మీద జరిగిన పోలీసుల దాడిని ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మన్నే క్రిశాంక్.