ఫోన్‌ ట్యాపింగ్‌తో నాకు సంబంధం లేదు: ప్రభాకర్‌రావు

-

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. జూన్‌ 23న ఆయన జూబ్లీహిల్స్‌ పోలీసులకు రాసిన లేఖ ఇప్పుడు బయటకు వచ్చింది. జూన్‌ 26న తాను భారత్‌కు రావాల్సి ఉందని .. ఆరోగ్యం బాగోలేక అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చిందని తెలిపారు. క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. అమెరికా వైద్యుల సూచనతో అక్కడే చికిత్స పొందుతున్నట్లు ప్రభాకర్‌రావు వివరించారు.

‘నాపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాకు లీక్‌లు ఇస్తున్నారు. పోలీసు అధికారిగా నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను, నా కుటుంబం మానసికంగా ఇబ్బందులు పడుతున్నాం. దర్యాప్తులో పోలీసులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. టెలీకాన్ఫరెన్స్, మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను క్రమశిక్షణ గల అధికారిని.. విచారణ ఎదుర్కొంటాను. నేను ఎక్కడికీ తప్పించుకుని పారిపోయే పరిస్థితి లేదు. నా ఆరోగ్యం కుదుటపడిన తర్వాత భారత్‌కు వస్తాను. గతంలోనూ పలుమార్లు ఉన్నతాధికారులకు విషయాన్ని చెప్పాను. నా దృష్టికి వచ్చిన సమాచారాన్ని విచారణాధికారికి చెబుతాను.’ అని ప్రభాకర్ రావు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news